మెడికల్ రీయంబర్స్మెంట్ క్లెయిమ్ ఎలా పొందాలి.
ఏ.పి. మెడికల్ రీయింబర్స్మెంట్ నిబంధనలు
ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972 ప్రకారం ఉద్యోగులు మరియు పింఛనుదారులు ప్రభుత్వ మార్గదర్శకాల ద్వారా వైద్య ఖర్చులను పొందే విధానం.
ప్రాథమిక మార్గదర్శకాలు
- ఈ సౌకర్యం పొందటానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ఆంధ్ర ప్రదేశ్ వారి గుర్తింపు పొందిన రిఫరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
- అత్యవసర పరిస్థితుల్లో (రోడ్డు యాక్సిడెంట్లు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ మొదలైనవి) నాన్ రెఫరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే, కారణాలను వివరిస్తూ proper channel లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.
- మెడికల్ రీయంబర్స్మెంట్ గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు (ఒకసారి ట్రీట్మెంట్ కు). ఈ పరిమితి దాటితే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందాలి.
- క్లెయిమ్ మొత్తం 50,000 కంటే లోపు ఉంటే స్క్రూటినీ DCHS చేస్తారు, మంజూరు అధికారం జిల్లా అధికారికి ఉంటుంది.
- క్లెయిమ్ మొత్తం 50,000 కంటే ఎక్కువ ఉంటే EHS ట్రస్ట్ ద్వారా స్క్రూటినీ చేయబడి, సంబంధిత శాఖాధిపతికి మంజూరు అధికారం ఉంటుంది.
50,000 లోపు క్లెయిమ్ చేసుకునే విధానం (Off-line)
- ఇవి పూర్తిగా ఆఫ్-లైన్ (off-line) మోడ్‌లో చేయాల్సి ఉంటుంది.
- నిర్దేశిత ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను ఉద్యోగి పనిచేసే కార్యాలయం ద్వారా సంబంధిత జిల్లా అధికారికి సమర్పించాలి.
- సంబంధిత జిల్లా అధికారి నుండి స్క్రూటినీ కొరకు డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) కు పంపాలి.
- ప్రభుత్వ ధరల ప్రకారం DCHS స్క్రూటినీ చేసి ఎంత మొత్తం మంజూరు చేయవచ్చో జిల్లా అధికారికి తెలుపుతారు.
- స్క్రూటినీ చేసి ఆమోదించిన మొత్తానికి జిల్లా అధికారి మంజూరు ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు.
50,000 కంటే ఎక్కువ క్లెయిమ్ విధానం (On-line EHS)
- ఇది EHS సైట్ ద్వారా ఉద్యోగి తన లాగిన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన రిఫరెన్స్ నంబర్‌ను మెన్షన్ చేస్తూ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను DDO కు సబ్మిట్ చేయాలి.
- కార్యాలయ అధికారి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను జిల్లా అధికారి ద్వారా శాఖాధిపతికి పంపుతారు. శాఖాధిపతి EHS ట్రస్ట్‌కు ఫార్వర్డ్ చేస్తున్నట్లు ఒక లేఖను జారీ చేస్తారు.
- శాఖాధిపతి జారీ చేసిన లేఖను DDO లాగిన్‌లో పెండింగ్ ఉన్న క్లెయిమ్‌కు జతపరచి ఫార్వర్డ్ చేస్తే అది EHS ట్రస్ట్‌కు చేరుతుంది.
- ప్రభుత్వ ధరల ప్రకారం EHS ట్రస్ట్ స్క్రూటినీ చేసి మంజూరు చేయదగిన మొత్తాన్ని జిల్లా అధికారికి తెలుపుతారు.
- ఆమోదించిన మొత్తానికి సంబంధిత శాఖాధిపతి మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు.
ట్రెజరీకి బిల్ సబ్మిట్ చేసే విధానం (CFMS)
- మంజూరు చేసిన క్లెయిమ్‌ను CFMS ద్వారా ట్రెజరీకి సబ్మిట్ చేయాలి.
- ఉద్యోగికి జీతం చెల్లించే పద్దులోనే 010/017 ఆబ్జెక్ట్ హెడ్స్ లో ఈ క్లెయిమ్ సమర్పించాలి.
- CFMS లో వర్క్ ఫ్లో ద్వారా మేకర్, చెక్కర్ (ఆప్షనల్), సబ్మిటర్ రోల్స్ అసైన్ చేసుకోవాలి (వన్ టైమ్ టాస్క్).
- మేకర్ లాగిన్‌లో HR క్లెయిమ్స్‌లో మెడికల్ రీయంబర్స్మెంట్ సెలెక్ట్ చేసుకుని DDO కు సబ్మిట్ చేయాలి. DDO దానిని ట్రెజరీకి సబ్మిట్ చేస్తారు.
- ట్రెజరీ ఆమోదం పొందిన తర్వాత, ఆర్థిక శాఖ వారు ekuber (RBI) ద్వారా ఉద్యోగి ఖాతాకు డబ్బు జమ చేస్తారు.
మెడికల్ క్లెయిమ్‌కు కావలసిన డాక్యుమెంట్లు
ఫార్మాట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి లింకులపై క్లిక్ చేయండి:
దరఖాస్తు (Application)
సర్టిఫికెట్ - ఎ (ఔట్ పేషెంట్లకు)
చెక్ లిస్ట్
డిపెండెంట్ సర్టిఫికెట్ (సెల్ఫ్)
ఎమర్జెన్సీ సర్టిఫికెట్
ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్
CFMS బిల్ క్రియేషన్ మాన్యువల్
డిశ్చార్జ్ సమ్మరీ (హాస్పిటల్ నుండి)
ఒరిజినల్ బిల్లులు
నాన్ డ్రాయల్ సర్టిఫికెట్ (DDO)
DME రెఫరల్ హాస్పిటల్ లేఖ