వ్యయర్స్: 1,25,480
లోడ్ అవుతుంది...
తాజా సమాచారం
సమాచారం లోడ్ అవుతుంది...

మెడికల్ రీయంబర్స్మెంట్ క్లెయిమ్ ఎలా పొందాలి.

ఏ.పి. మెడికల్ రీయింబర్స్మెంట్ నిబంధనలు

ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972 ప్రకారం ఉద్యోగులు మరియు పింఛనుదారులు ప్రభుత్వ మార్గదర్శకాల ద్వారా వైద్య ఖర్చులను పొందే విధానం.

ప్రాథమిక మార్గదర్శకాలు

  • ఈ సౌకర్యం పొందటానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ఆంధ్ర ప్రదేశ్ వారి గుర్తింపు పొందిన రిఫరల్ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
  • అత్యవసర పరిస్థితుల్లో (రోడ్డు యాక్సిడెంట్లు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ మొదలైనవి) నాన్ రెఫరల్ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకుంటే, కారణాలను వివరిస్తూ proper channel లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.
  • మెడికల్ రీయంబర్స్మెంట్ గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు (ఒకసారి ట్రీట్మెంట్ కు). ఈ పరిమితి దాటితే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందాలి.
  • క్లెయిమ్ మొత్తం 50,000 కంటే లోపు ఉంటే స్క్రూటినీ DCHS చేస్తారు, మంజూరు అధికారం జిల్లా అధికారికి ఉంటుంది.
  • క్లెయిమ్ మొత్తం 50,000 కంటే ఎక్కువ ఉంటే EHS ట్రస్ట్ ద్వారా స్క్రూటినీ చేయబడి, సంబంధిత శాఖాధిపతికి మంజూరు అధికారం ఉంటుంది.

50,000 లోపు క్లెయిమ్ చేసుకునే విధానం (Off-line)

  • ఇవి పూర్తిగా ఆఫ్-లైన్ (off-line) మోడ్‌లో చేయాల్సి ఉంటుంది.
  • నిర్దేశిత ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను ఉద్యోగి పనిచేసే కార్యాలయం ద్వారా సంబంధిత జిల్లా అధికారికి సమర్పించాలి.
  • సంబంధిత జిల్లా అధికారి నుండి స్క్రూటినీ కొరకు డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) కు పంపాలి.
  • ప్రభుత్వ ధరల ప్రకారం DCHS స్క్రూటినీ చేసి ఎంత మొత్తం మంజూరు చేయవచ్చో జిల్లా అధికారికి తెలుపుతారు.
  • స్క్రూటినీ చేసి ఆమోదించిన మొత్తానికి జిల్లా అధికారి మంజూరు ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు.

50,000 కంటే ఎక్కువ క్లెయిమ్ విధానం (On-line EHS)

  • ఇది EHS సైట్ ద్వారా ఉద్యోగి తన లాగిన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన రిఫరెన్స్ నంబర్‌ను మెన్షన్ చేస్తూ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను DDO కు సబ్మిట్ చేయాలి.
  • కార్యాలయ అధికారి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను జిల్లా అధికారి ద్వారా శాఖాధిపతికి పంపుతారు. శాఖాధిపతి EHS ట్రస్ట్‌కు ఫార్వర్డ్ చేస్తున్నట్లు ఒక లేఖను జారీ చేస్తారు.
  • శాఖాధిపతి జారీ చేసిన లేఖను DDO లాగిన్‌లో పెండింగ్ ఉన్న క్లెయిమ్‌కు జతపరచి ఫార్వర్డ్ చేస్తే అది EHS ట్రస్ట్‌కు చేరుతుంది.
  • ప్రభుత్వ ధరల ప్రకారం EHS ట్రస్ట్ స్క్రూటినీ చేసి మంజూరు చేయదగిన మొత్తాన్ని జిల్లా అధికారికి తెలుపుతారు.
  • ఆమోదించిన మొత్తానికి సంబంధిత శాఖాధిపతి మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు.

ట్రెజరీకి బిల్ సబ్మిట్ చేసే విధానం (CFMS)

  • మంజూరు చేసిన క్లెయిమ్‌ను CFMS ద్వారా ట్రెజరీకి సబ్మిట్ చేయాలి.
  • ఉద్యోగికి జీతం చెల్లించే పద్దులోనే 010/017 ఆబ్జెక్ట్ హెడ్స్ లో ఈ క్లెయిమ్ సమర్పించాలి.
  • CFMS లో వర్క్ ఫ్లో ద్వారా మేకర్, చెక్కర్ (ఆప్షనల్), సబ్మిటర్ రోల్స్ అసైన్ చేసుకోవాలి (వన్ టైమ్ టాస్క్).
  • మేకర్ లాగిన్‌లో HR క్లెయిమ్స్‌లో మెడికల్ రీయంబర్స్మెంట్ సెలెక్ట్ చేసుకుని DDO కు సబ్మిట్ చేయాలి. DDO దానిని ట్రెజరీకి సబ్మిట్ చేస్తారు.
  • ట్రెజరీ ఆమోదం పొందిన తర్వాత, ఆర్థిక శాఖ వారు ekuber (RBI) ద్వారా ఉద్యోగి ఖాతాకు డబ్బు జమ చేస్తారు.

మెడికల్ క్లెయిమ్‌కు కావలసిన డాక్యుమెంట్లు

ఫార్మాట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింకులపై క్లిక్ చేయండి:

రసాయట పోస్ట్‌లు (Recent Posts)

Subjects

Departments

Calender

Sun
Mon
Tue
Wed
Thu
Fri
Sat

సెలవులు

Calculator

Our other websites
Gemini Copilot ChatGPT Gmail Google Maps Google Drive