ప్రభుత్వ ఉద్యోగుల అనధికార గైర్హాజరు - మార్గదర్శకాలు
ఉద్యోగులు తగిన సెలవు లేకుండా విధులకు గైర్హాజరు కావడం, విధుల్లో చేరడం, డిసిప్లినరీ చర్యలు, రాజీనామా మరియు స్వచ్ఛంద పదవీ విరమణపై ప్రభుత్వం జారీ చేసిన పూర్తి వివరాలు.
- అనుమతి లేకుండా గైర్హాజరైన ఉద్యోగి ఎప్పుడైనా జాయినింగ్ రిపోర్ట్ ఇస్తే, క్రమశిక్షణా చర్యలతో సంబంధం లేకుండా తక్షణమే విధుల్లోకి అనుమతించాలి.
- ఎలాంటి సెలవు అనుమతి లేని ఈ గైర్హాజరు కాలం మొత్తాన్ని నిబంధనల ప్రకారం 'డైస్-నాన్' (Dies-Non) గా పరిగణించి ఇంక్రిమెంట్లు, సెలవులు మరియు పెన్షన్ ప్రయోజనాలను నిలిపివేయాలి.
- గైర్హాజరు కాలం 'డైస్-నాన్' చేయడం అనేది ఉద్యోగిపై తీసుకునే డిసిప్లినరీ చర్యలకు పూర్తిగా భిన్నమైనది.
- క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడానికి ఉద్యోగి 5 సంవత్సరాలు నిరంతరం గైర్హాజరు కావాలని వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా విచారణ ప్రారంభించవచ్చు.
- ఏ.పి.సి.ఎస్. (సి.సి.ఎ) రూల్స్, 1963 ప్రకారం ఛార్జ్ మెమో జారీ చేసి 1 నుండి 2 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలి.
- ఉద్యోగి అందుబాటులో లేకపోతే గెజిట్‌లో ప్రచురించి ఎక్స్-పార్టే (Ex-parte) విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవచ్చు.
ఎమర్జెన్సీ నిబంధనల కింద పనిచేసే తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులు అనధికారికంగా గైర్హాజరైతే, సంబంధిత నిబంధనలను అనుసరించి తక్షణమే వారిని సర్వీస్ నుండి డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
ఉద్యోగి అనధికారికంగా గైర్హాజరులో ఉన్న సమయంలో రాజీనామా సమర్పిస్తే, జనరల్ రూల్ 39 ప్రకారం రాజీనామా ఆమోదిస్తే అతని మునుపటి సర్వీస్ అంతా కోల్పోతారు. కాబట్టి గైర్హాజరు కాలంపై నిర్ణయం కోసం ఆగకుండా రాజీనామాను ఆమోదించవచ్చు. అలాగే 20/33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నవారు VRS కోరితే, గైర్హాజరు కాలంతో సంబంధం లేకుండా దానిని పరిశీలించవచ్చు.