G.O.Ms.No.151, సాధారణ పరిపాలన (Ser.G) శాఖ, తేదీ: 22-06-2004 ప్రకారం కారుణ్య నియామకం కింద అర్హతలు లేకుండా ఉద్యోగంలో చేరిన వారు, ఏ రోజైతే ఆ పూర్తి అర్హతలను సాధిస్తారో, ఆ రోజు (From the date of acquiring such
qualification fully) నుంచి మాత్రమే వారి సర్వీసు
క్రమబద్ధీకరించబడుతుంది.
కారుణ్య నియామకాలు
నియామక పద్ధతి: సర్వీసులో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు జూనియర్ అసిస్టెంట్ లేదా ఆ కింది స్థాయి పోస్టులలో కారుణ్య నియామకం కల్పిస్తారు .
- నిబంధన: కారుణ్య
నియామకాలను 'డైరెక్ట్ రిక్రూట్మెంట్' (Direct Recruitment) కింద పరిగణిస్తారు.
జివో 151 కి ముందు సర్విస్ క్రమబద్ధీకరించే విధానం
- Reference: G.O.Ms.No.60, G.A. (Ser.A) Dept, Date: 11.2.1997.
- పోస్టుకు
అవసరమైన పూర్తి విద్యా/సాంకేతిక అర్హతలు లేకపోయినా, భవిష్యత్తులో వాటిని సాధించే షరతుపై
(Subject to
acquiring qualification) ఉద్యోగంలోకి తీసుకుంటారు.
- G.O. 60) ప్రకారం అభ్యర్థి నిర్ణీత
గడువులోగా అర్హతలు సాధిస్తే, వారు ఉద్యోగంలో చేరిన మొదటి రోజు (Date of initial appointment) నుంచే వారి సర్వీసును
క్రమబద్ధీకరించేవారు (Regularisation).
- A.P. State
and Subordinate Service Rules లోని 'Rule 12' ప్రకారం: డైరెక్ట్ రిక్రూట్మెంట్
ద్వారా పబ్లిక్ సర్వీస్‌లోకి వచ్చే ఏ వ్యక్తయినా, ఆ పోస్టుకు అవసరమైన పూర్తి అర్హతలను
కచ్చితంగా కలిగి ఉండాలి.
- కారుణ్య
నియామకం ద్వారా వచ్చి ఎప్పుడో ఆలస్యంగా అర్హతలు సాధించిన వారికి మొదటి రోజు
నుంచే సర్వీసును రెగ్యులరైజ్ చేయడం ఈ 'రూల్ 12' కు విరుద్ధం.
- దీనివల్ల, పూర్తి అర్హతలతో డైరెక్ట్ రిక్రూట్మెంట్
లేదా ప్రమోషన్/ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చిన ఇతర ఉద్యోగులకు, వీరికి మధ్య సీనియారిటీ (Inter-se-seniority) ఖరారు చేయడంలో తీవ్ర న్యాయపరమైన, పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయి.
G.O. 151 ద్వారా సవరణ
పై సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం G.O.Ms.No.60 లోని పేరా 5 కి సవరణ (Amendment) చేసింది.
- సవరించిన
నిబంధన: కారుణ్య
నియామకం కింద అర్హతలు లేకుండా ఉద్యోగంలో చేరిన వారు, ఏ రోజైతే ఆ పూర్తి అర్హతలను
సాధిస్తారో, ఆ రోజు (From the date of acquiring such
qualification fully) నుంచి మాత్రమే వారి సర్వీసు క్రమబద్ధీకరించబడుతుంది.
GO 151 అనునది నేరుగా కారుణ్య నియామకం పొందిన వారికైనా లేక అప్పటికే ఉద్యోగంలో ఉండి ప్రమోషన్ పొందిన వారికి (Condition on Promotion) వారికి కూడా వర్తిస్తుందా? దయచేసి తెలుపగలరు
రిప్లయితొలగించండిసాధారణం గా పూర్తి అర్హతలు కలిగి ఉన్నవారికి మాత్రమే పదోన్నతి ఇస్తారు. Conditional Promotion ఉండదు. పరిపాలనా పరమైన అవసరాలు ఉంటే అర్హతలు లేకపోయినా adhoc ప్రోమోషన్ లు ఇస్తారు. వీరికి పొరరతి పదోన్నతి కి ఎప్పుడు అయితే అర్హత ఉంటుందో అప్పుడే క్రమబద్ధీకరించబడుతుంది
తొలగించండిధన్యవాదములు సర్. కానీ నా విషయము తెలుపుతాను, సందేహాన్ని నివృత్తి చేయండి.
రిప్లయితొలగించండినేను Compassionate appointment క్రింద 12-11-1999 లో అటెండర్ గా జిల్లాపరిషత్ వారి ద్వారా ఉద్యోగంలో చేరాను. తదుపరి Type Writing English Higher అర్హతతో 26-05-2006 నాడు Typist గా పదోన్నతి పొందినాను. అందులో probation లోపల Type Writing Telugu Higher అర్హత పొందవలెనని కండిషన్ పై పదోన్నతి ఉత్తర్వులు ఇచ్చియున్నారు. అట్టి అర్హతను నేను ఆగస్టు 2008 నందు పూర్తి చేసి పై అధికారుల వారికి తెలిపిననాను. తదుపరి 26-05-2014 నాటికి SGP scale ఇచ్చియున్నారు. PRC నందు 6/12/18/24 AAS మార్చిన తరువాత 26-05-2012 నాటికి SGP ని సవరించి 26-05-2018 నాటికి 12 సంవత్సరముల SPP -1 scale ను ఇచ్చియున్నారు. ప్రస్తుతం 26-05-2024 నాటికి 18 సంవత్సరములు పూర్తి చేసుకుని SPP-II scale మంజూరు కొరకు ప్రతిపాదనలు పంపితే ఆగస్టు 2025 నాడు పంపండి అని త్రిప్పి పంపియున్నారు. ప్రస్తుతం 28-12-2025 నాడు Senior Assistant గా పదోన్నతి పొందియున్నాను. నా సీనియారిటీ విషయములో కూడా August నెలలో తెలుగు హయ్యర్ పరీక్ష పాస్ అయ్యిన తేదీ నుండి సీనియారిటీ పొందు పరిచినారు. G.O 151, మరియు G.O 60 ప్రకారం ఉత్తీర్ణత పొందిన తేదీని పరిగణలోకి తీసుకున్నారు. ఈ పై GO లు నా విషయంలో వర్తిస్తాయా తెలుపగలరు. అలాగే AAS scale ను రివైజ్ చేసుకోవలెనా తెలుపగలరు. 18 సంవత్సరముల scale ను నేను ఇంకనూ తీసుకోలేదు. అందువల్ల నాకు దయచేసి నా విషయములో సహాయం చేయగలని ప్రార్థిస్తున్నాను.
Sir pls reply
రిప్లయితొలగించండిఒకసారి వివరంగా పరిశీలించి చెబుతాను. 9110541733 నెంబర్ తో whatsapp ద్వారా కాంటాక్ట్ చేయవచ్చు.
తొలగించండిధన్యవాదములు సర్
రిప్లయితొలగించండి