సెలవులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సెలవులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, డిసెంబర్ 28, 2023

10 వ వేతన సంఘ సిఫార్సుల మేరకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు G.O.Ms.No.209 ఆర్ధిక (HR III) శాఖ, 21.11.2016 ద్వారా చైల్డ్ కేర్ లీవ్ కల్పించ బడింది. 

ఎన్ని రోజులు ఏ విధంగా  పొందవచ్చు 

  • సర్వీసు మొత్తం లో మూడు నెలలు పొందవచ్చు. 
  • ఒక్కొక్క స్పెల్ లో గరిష్టంగా 15 రోజులకు మించకుండా వాడుకొనవచ్చును.
  • కనీసం ఆరు స్పెల్ల్స్ కు తగ్గకుండా వాడుకోవాలి.
  • చైల్డ్ కేర్ లీవ్ ని హక్కు గా పొందలేరు. తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందిన తదుపరి మాత్రమే ఉపయోగించుకొనవలెను.
  • క్యాజువల్ లీవ్ మరియు స్పెషల్ క్యాజువల్ లీవ్ మినహా మిగిన అన్ని రకాల సెలవులకు కొనసాగింపు గా ఈ సెలవు ఉపయోగించు కొనవచ్చును.

 అర్హత

  • 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు. (పిల్లలు విభిన్న ప్రతిభావంతులు అయినచో 22 సంవత్సరాల వయసు వరకు ఉపయోగించు కోవచ్చు)
  • పిల్లలు సదరు ఉద్యోగి పై ఆధార పడి ఉద్యోగితోపాటు నివసిస్తూ ఉండాలి. 
  • ప్రొబేషన్ లో ఉన్నవారు కూడా ఈ సెలవు పొందుటకు అర్హులు. ప్రొబేషన్ లో ఉండగా ఈ సెలవు ఉపయోగించుకొనడం వల్ల ప్రొబేషన్ పొడిగింప బడుతుంది . 

దేని కొరకు ఉపయోగించి కొనవచ్చును

  • పిల్లల పరీక్షలు, అనారోగ్య కారణాలు, వారి సంరక్షణ కొరకు ఏ అవసరాలకు అయినా సరే ఉపయోగించుకొన వచ్చును.

ఇతర నిబంధనలు

  • ఈ సెలవు కాలంలో లీవ్ ట్రావెల్  కన్సిషన్ ఉపయోగించు కోకూడదు.
  • ఉద్యోగి కి ఈ సెలవు మంజూరు చేయడం వల్ల కార్యాలయం ద్వారా నిర్వహించ బడే ప్రభుత్వ కార్యకలాపాల పై ప్రభావం లేకుండా కార్యాలయ అధికారి జాగ్రత్త వహించ వలెను. 
  • ఉద్యోగి సెలవు లోకి వెళ్లక ముందు పొందిన పే ఆధారంగానే చైల్డ్ కేర్ లీవ్ కాలంలో జీతం చెల్లించ వలెను. 

సెలవు ఖాతా నిల్వహించవలసిన విధానం.

ఈ దిగువ తెలిపిన ప్రోఫోర్మా నందు ఉద్యోగి యొక్క సర్వీసు రిజిస్టర్ నందు ఈ సెలవు ఖాతా నిర్వహించ వలెను. 

Period of Child Care Leave Taken

Balance of Child Care Leave

Signature and Designation of Certifying Officer

 From

To

Balance

Date

(1)

(2)

(3)

(4)

(5)

  

 

 

 

 

  

 

 

 

 

ఈ సెలవును ఉద్యోగి యొక్క చైల్డ్ కేర్ సెలవు ఖాతాలో మాత్రమే తగ్గించవలెను.రెగ్యులర్ లీవ్ ఎకౌంటుతో కలపకూడదు. 

సూచన:-

చైల్డ్ కేర్ సెలవు వాడుకోవడానికి ముందుగా ఉద్యోగి  కుటుంబ సభ్యులను డిక్లేర్ చేస్తూ సర్వీసు రిజిస్టర్ లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయంచుకొన వలెను. (Family Members Declaration Form )

 


ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు మరియు 10 వ వేతన సంఘ సిఫార్సుల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు G.O.Ms.No.132 ఆర్ధిక (HR IV-FR) శాఖ, 06.07.2016 ద్వారా చైల్డ్ కేర్ లీవ్ కల్పించ బడింది. 

ఎన్ని రోజులు ఏ విధంగా  పొందవచ్చు 

  • సర్వీసు మొత్తం లో 180 రోజులు పొందవచ్చు. (G.O.Ms.No.33 ఆర్ధిక (HR IV FR & LR) శాఖ, 08.03.2022.)
  • కనీసం మూడు స్పెల్ల్స్ కు తగ్గకుండా వాడుకోవాలి.
  • గరిష్టంగా 10 స్పెల్ల్స్ కు మించకుండా వాడుకోవాలి. (G.O.Ms.No.199 ఆర్ధిక (HR IV & LR) శాఖ, 19.10.2022).
  • చైల్డ్ కేర్ లీవ్ ని హక్కు గా పొందలేరు. తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందిన తదుపరి మాత్రమే ఉపయోగించుకొనవలెను.
  • క్యాజువల్ లీవ్ మరియు స్పెషల్ క్యాజువల్ లీవ్ మినహా మిగిన అన్ని రకాల సెలవులకు కొనసాగింపు గా ఈ సెలవు ఉపయోగించు కొనవచ్చును.
  • సంపాదిత సెలవు మంజూరు చేయు అధికారం ఉన్న వారు దీనిని మంజూరు చేయవచ్చును.

అర్హులు

  • 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు. (పిల్లలు విభిన్న ప్రతిభావంతులు అయినచో 22 సంవత్సరాల వయసు వరకు ఉపయోగించు కోవచ్చు)
  • పిల్లలు సదరు ఉద్యోగి పై ఆధార పడి ఉండాలి.
  • పురుష ఉద్యోగులు సింగిల్ పేరెంట్స్ అయినచో (వివాహం కాని వారు, విడాకులు తీసుకున్న వారు, భార్య చనిపోయిన వారు). (G.O.Ms.No.33 ఆర్ధిక (HR IV FR & LR) శాఖ, 08.03.2022.)
  • ప్రొబేషన్ లో ఉన్నవారు కూడా ఈ సెలవు పొందుటకు అర్హులు. ప్రొబేషన్ లో ఉండగా ఈ సెలవు ఉపయోగించుకొనడం వల్ల ప్రొబేషన్ పొడిగింప బడుతుంది .

దేని కొరకు ఉపయోగించి కొనవచ్చును

  • పిల్లల చదువు, అనారోగ్య కారణాలు, వారి సంరక్షణ కొరకు ఏ అవసరాలకు అయినా సరే ఉపయోగించుకొన వచ్చును. 

సెలవు ఖాతా నిల్వహించవలసిన విధానం.

ఈ దిగువ తెలిపిన ప్రోఫోర్మా నందు ఉద్యోగి యొక్క సర్వీసు రిజిస్టర్ నందు ఈ సెలవు ఖాతా నిర్వహించ వలెను. 

Period of Child Care Leave Taken

Balance of Child Care Leave

Signature and Designation of Certifying Officer

 From

To

Balance

Date

(1)

(2)

(3)

(4)

(5)

  

 

 

 

 

  

 

 

 

 

ఈ సెలవును ఉద్యోగి యొక్క చైల్డ్ కేర్ సెలవు ఖాతాలో మాత్రమే తగ్గించవలెను. సంపాదిత సెలవు (EL) లేదా అర్ధ వేతన సెలవు ఖాతాలో తగ్గించ కూడదు

ఇతర నిబంధనలు

  • ఈ సెలవు కాలంలో లీవ్ ట్రావెల్  కన్సిషన్ ఉపయోగించు కోకూడదు.
  • ఉద్యోగి కి ఈ సెలవు మంజూరు చేయడం వల్ల కార్యాలయం ద్వారా నిర్వహించ బడే ప్రభుత్వ కార్యకలాపాల పై ప్రభావం లేకుండా కార్యాలయ అధికారి జాగ్రత్త వహించ వలెను. 
 
సూచన:-

చైల్డ్ కేర్ సెలవు వాడుకోవడానికి ముందుగా ఉద్యోగి  కుటుంబ సభ్యులను డిక్లేర్ చేస్తూ సర్వీసు రిజిస్టర్ లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయంచుకొన వలెను. (Family Members Declaration Form )

ఆదివారం, సెప్టెంబర్ 11, 2022

  • ప్రభుత్వం ప్రత్యెక పరిస్తితులుగా పరిగణిస్తే తప్ప ఏ ప్రభుత్వ ఉద్యోగికి వరుసగా ఐదేళ్లకు మించి సెలవు మంజూరు చేయకూడదు. కేవలం అనారోగ్య కారణాల వల్ల ఆ ఉద్యోగి గైర్హాజరు అయిన సందర్భం లో, ఆ ఉద్యోగి తిరిగి విధుల్లో చేరగలడని వైద్యుల సలహా మేరకు మాత్రమే వెసులు బాటు ఇవ్వవచ్చు. మానసిక, శారీరక అనారోగ్య సమస్యల కారణంగా గైర్హాజరు అయితే ఉద్దేశ్య పూర్వక గైర్హాజరు గా పరిగణించాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భంలో ఐదేళ్లకు మించిన సెలవును అసాధారణ సెలవు (EOL) పరిగణించ వచ్చు. 
  • ఉద్దేశ్య పూర్వకమైన గైర్హాజరు ని డైస్ నాన్ గా పరిగణించాలి. ఈ కాలాన్ని ఇంక్రిమెంట్ కి, లీవ్ కి, పెన్షన్ కి పరిగణన లోకి తీసుకోకూడదు.
  • వైద్య కారణాల పై తీసుకునే అసాధారణ సెలవు (EOL) ని 36 నెలల వరకు  అర్హత  గల సర్వీస్ గా పరిగణన లోకి తీసుకోవచ్చు.    
  • సాంకేతిక విద్య కొరకు అసాధారణ సెలవు పొందితే  36 నెలల వరకు అర్హత గల సర్వీస్ గా పరిగణన లోకి తీసుకోన వచ్చును. కాకపోతె కోర్సు పూర్తీ అయిన తరువాత 36 నెలల పాటు ప్రభుత్వ సర్వీస్ లో ఉండాలి.
  • ఎవరినా ఉద్యోగి ఏడాది కన్నా ఎక్కువ కాలం గైర్హాజరు అయితే, ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీస్ (CCA) రూల్స్ ని అనుసరించి ఆ ఉద్యోగికి "removal from service" పెనాల్టీ ని విధించాలి. (జివో ఎమ్మెస్ 8, ఆర్ధిక శాఖ, తేదీ.08.01.2004) 
  • రెగ్యులర్ ఉద్యోగి ఉద్దేశ్య పూర్వకంగా గైర్హాజరు అయితే ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీస్ (CCA) రూల్స్ లోని రూల్ 20 ప్రకారం క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలి. ఆ ఉద్యోగి కి చార్జ్ మేమో జారీ చేసి కార్యాలయం లో అందుబాటులో ఉన్న తాజా చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. ఆ ఉద్యోగి ఆ చిరునామా లో అందుబాటులో లేకపోతె ఆంధ్ర ప్రదేశ్ గజిట్ లో పబ్లిష్ చేసి ex-parte విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి. ఆ తరువాతఅ ఉద్యోగి విధుల్లోకి వచ్చినా అతనిని విధుల్లోకి చేర్చుకుని ఒకవేళ ఆ ఉద్యోగి వైద్య కారణాలపై సెలవు పెడితే మంజూరు చేయవచ్చు. మూడు నెలలకు పైబడిన సందర్భంలో మెడికల్ బోర్డు కి రిఫర్ చేయాల్సి ఉంటుంది.
  • తాత్కాలిక ఉద్యోగి ఉద్దేశ్య పూర్వకమగా విధులకు గైర్హాజరు అయితే అతనిని వెంటనే విధుల నుండి తప్పించవచ్చు. 
  • గైర్హాజరు అయిన ఉద్యోగి రాజీనామా సమర్పిస్తే ఆటను విధుల్లో ఉంటె రిలీవ్ చేసిన రోజు నుండి  రాజీనామా చేసినట్లు గా పరిగణించాలి. సెలవులో ఉంటె రాజీనామా ను ఆమోదించిన తేదీ ని పరిగణించాలి.
  • తీవ్రమైన అభియోగాలతో సస్పెన్షన్ లో ఉద్యోగి రాజీనామా ని ఆమోదించ రాదు. 
  • రాజీనామా ఆమోదం పొందిన తరువాత తిరిగి వెనుకకు తీసుకునే అవకాశం లేదు. ఆటను ప్రస్తుత పోస్టు లో చేసిన సర్వీస్ మాత్రమే కాకుండా, ఇప్పటివరకు వరకు చేసిన సర్వీస్ మొత్తాన్ని కోల్పోతాడు. 
  • ఒక ఉద్యోగి ఐదేళ్ళ పాటు సెలవులో ఉండి ఐదేళ్ళు పూర్తీ అయినా కూడా తిరిగి విధులకు రిపోర్ట్ చేయకపోతే అతనిని ఉద్యోగం నుండి తొలగించవలెను (Removal from service)
  • ఒక ప్రభుత్వ ఉద్యోగి అనుమతి లేకుండా ఏడాది పాటు విధులకు గైర్హాజరు అయితే ఆ ఉద్యోగి రాజీనామా చేసినట్లుగా పరిగణించాలి.
  • ప్రభుత్వం నిర్దేశించిన సమయం దాటి ఫారిన్ సర్వీస్ లో ఉండి మాతృ శాఖ కు రిపోర్ట్ చేయకపోతే ఆ ఉద్యోగి రాజీనామా చేసినట్లు గా పరిగణించాలి. 


  • తాత్కాలిక మరియు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఈ సెలవు పొందటానికి అర్హులు
  • తాత్కాలిక ఉద్యోగులకు ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా (జనవరి & జూలై) 8 రోజులు జమ చేయబడతాయి.
  • శాశ్వత ఉద్యోగులకు ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా  (జనవరి & జూలై) 15 రోజులు జమ చేయబడతాయి.
  • వెకేషన్ డిపార్టుమెంటు లలో పని చేసే వారికి ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా 3 రోజులు జమ చేయబడతాయి.
  • ఈ లీవ్ జమ చేయడానికి రోజులు ఉన్న నెలల్ని వదలి పెట్టి పూర్తీ గా సర్వీస్ చేసిన నెలలను పరిగణన లోకి తీసుకుంటారు. 
  • ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో చేరినట్లయితే మొదటి రెండు నెలలకు ఒక్కొక్క రోజు, ప్రతీ మూడవ నెలకు రెండు రోజులు జమ చేస్తారు, ఉదాహరణకు ఒక ఉద్యోగి ఫిబ్రవరి 12 వ తేదీన తాత్కాలిక ప్రాతిపదికన చేరితే 
    • ఫిబ్రవరి కి "0"
    • మార్చి కి ఒక రోజు 
    • ఏప్రిల్ కి ఒక రోజు
    • మే కి రెండు రోజులు
  • జూన్ కి ఒక రోజు చొప్పున మొత్తం ఐదు రోజులు అడ్వాన్సుగా జమ చేస్తారు
  • ఎవరైనా ఉద్యోగి కొంత కాలం జీత నష్టపు సెలవు (EOL) లో ఉన్నట్లయితే తదుపరి అర్ధ సంవత్సరానికి ఎంతకాలం EOL లో ఉంటె అందులో పదో వంతు EL తగ్గించాలి (గరిష్టంగా శాశ్వత ఉద్యోగులకు 15, తాత్కాలిక ఉద్యోగులకు 8 రోజులు తగ్గించాలి)
  • ఉదాహరణకు ఒక ఉద్యోగి జూలై నుండి డిసెంబర్ మధ్యలో 67 రోజులు EOL లో ఉన్నట్లయితే తదుపరి జనవరి నెలలో జమ చేసే 15 రోజులలో 7 రోజులు తగ్గించి 8 రోజులు జమ చేయాలి.
  •  గరిష్టంగా నిల్వ ఉండే సంపాదిత సెలవు ౩00 రోజులు (16.09.2005 నుండి)
  • 01.06.1964 నుండి 30.06.1983 గరిష్ట నిల్వ పరిధి 180 రోజులు
  • 01.07.1983 నుండి 15.09.2005 మధ్యలో గరిష్ట నిల్వ పరిధి 240 రోజులు
  • వైద్య కారణాలపై లేదా వ్యక్తిగత కారణాలతో ఒకేసారి గరిష్టంగా ఆరు నెలలు దాటకుండా ఉపయోగించుకోవచ్చు. (నాల్గవ తరగతి ఉద్యోగులు అయితే 120 రోజులు)
  • CL మినహా ఇతర లీవులతో కలిపి ఉపయోగించుకోవచ్చు. 
  • పబ్లిక్ హాలిడే, ఆప్షనల్ హాలిడే, CCL లని సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ గా ఉపయోగించుకోవచ్చు. 
  • ఆరు నెలల వరకు అన్ని రకాల అలవెన్సులు తో పూర్తి జీతం పొందవచ్చు. ఆరు నెలల తరువాత HRA, CCA చెల్లించారు. 
  • నిల్వ ఉన్నా సంపాదిత సెలవు ని సరెండర్ చేసుకుని దానికి సమానమైన నగదు పొందవచ్చు.
  • 15 రోజులు సరెండర్ చేసుకోవడానికి 12 నెలల విరామం, 30 రోజులు సరెండర్ చేసుకోవడానికి 24 నెలల విరామం అవసరం.
  • సంపాదిత సెలవు నిల్వ కనుక 285 రోజుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 12 నెలల గ్యాప్ లేకపోయినా 15 రోజులు సరెండర్ చేసుకోవచ్చు.
  • ఒక ఆర్ధిక సంవత్సరంలో ఒకేసారి ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. 
  • తాత్కాలిక ఉద్యోగులు కూడా 24 నెలల విరామం తరువాత 15 రోజులు సరెండర్ చేసుకోవచ్చు. 
  • మంజూరు ఉత్తర్వులు మంజూరు చేసిన తేదీ నుండి 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి.
  • పదవీ విరమణ పొందినపుడు లేదా సర్వీస్ లో ఉండగా చనిపోయినా ఉద్యోగి సంపాదిత ఖాతాలో ఉన్న నిల్వలు సమానమైన మొత్తాన్ని నగదు గా చెల్లిస్తారు (గరిష్టంగా ౩00 రోజులు)
  • ప్రభుత్వ క్వార్టర్ల లో ఉండేవారికి HRA చెల్లించవచ్చు. 
  • కన్వేయన్స్ అలవెన్సు, IR లు చెల్లించబడవు.
  • తాత్కాలిక ఉద్యోగులుగా చేరిన వారి సర్వీస్ రెగ్యులరైజ్ అయ్యాక లీవులను రీకాస్ట్ చెయ్యాలి

మొత్తం పేజీ వీక్షణలు

WEBSITES

Recent Posts

Popular Posts