అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, పరిపాలనా పనులు సజావుగా సాగేలా చూసేందుకు DSC-1998 మరియు DSC-2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సేవలను పునరుద్ధరిస్తూ (Renewal) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అధికారిక మెమో విడుదల చేశారు.
11 నెలల పాటు సేవల పొడిగింపు
గత విద్యాసంవత్సరంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 'మినిమం టైమ్ స్కేల్' (Minimum Time Scale) పై పనిచేసిన ఉపాధ్యాయులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుంది. ప్రస్తుత 2026-27 విద్యాసంవత్సరానికి గానూ, 01-06-2026 నుండి 30-04-2027 వరకు మొత్తం 11 నెలల కాలపరిమితికి వీరికి అనుమతి లభించింది.
'నో వర్క్ - నో పే' నిబంధన
ఈ సేవల పొడిగింపునకు ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిబంధనలను విధించింది:
11 నెలల కాలపరిమితి ముగిసిన తర్వాత వీరికి ఒక నెల విరామం (Break) ఉంటుంది.
ఈ నియామక కాలం పూర్తిగా 'నో వర్క్ - నో పే' (No work - No pay) సూత్రంపై ఆధారపడి ఉంటుంది.
ఆర్థిక శాఖ (Finance HR.II Department) నుంచి లభించిన ఆమోదం మరియు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నివేదిక ఆధారంగా ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు మెమోలో పేర్కొన్నారు. ఈ విషయమై తదుపరి అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి