తెలుగు లో పూర్తి నియమాల కోసం క్లిక్ చేయండి
ప్రారంభం & నిర్వచనాలు
రూల్ 1 (పేరు & అమలు): వీటిని 'జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (ఆంధ్రప్రదేశ్) రూల్స్' అంటారు. ఇవి 1935 నుంచి అమలులోకి వచ్చాయి.
రూల్ 2 (నిర్వచనాలు): ఇందులో ఖాతా అధికారి (Accounts Officer), కుటుంబం, జీతం (వేతనం) లాంటి ముఖ్యమైన పదాలకు అర్థాలు చెప్పారు. (ఉదాహరణకు: కుటుంబం అంటే భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులు).
రూల్ 3 (కరెన్సీ): ఈ ఫండ్ లావాదేవీలన్నీ మన భారతీయ రూపాయలలోనే జరుగుతాయి.
రూల్ 4: (ఈ రూల్ తొలగించబడింది).
ఎవరు చేరాలి & నామినేషన్
రూల్ 5 (ఎవరు చేరాలి): సెప్టెంబర్ 1, 2004 కంటే ముందు ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది తప్పనిసరి. ఆ తర్వాత చేరిన వారికి ఇది వర్తించదు (వారికి CPS ఉంది కాబట్టి).
రూల్ 6: (తొలగించబడింది).
రూల్ 7 (నామినేషన్): ఫండ్‌లో చేరిన వెంటనే మన ఖాతాకు నామినీని ప్రకటించాలి. కుటుంబం ఉంటే కచ్చితంగా కుటుంబ సభ్యులనే నామినీగా పెట్టాలి.
చందాలు (Subscriptions)
రూల్ 8 (ఖాతా): ప్రతి ఉద్యోగి పేరు మీద ఒక ఖాతా ఉంటుంది. కట్టిన చందాలు, వడ్డీ అందులోనే కనిపిస్తాయి.
రూల్ 9 (చందా ఎప్పుడు కట్టాలి): ప్రతి నెలా తప్పనిసరిగా చందా కట్టాలి. కానీ, జీతం లేని సెలవులో ఉన్నప్పుడు లేదా సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు కట్టకపోయినా పర్వాలేదు. రిటైర్మెంట్‌కి 4 నెలల ముందు కట్టడం ఆపేయాలి.
రూల్ 10 (చందా రేట్లు): కనీసం జీతంలో 6% కట్టాలి. ఏడాదికి ఒకసారి ఈ చందా శాతాన్ని తగ్గించుకోవచ్చు, లేదా రెండుసార్లు పెంచుకోవచ్చు.
రూల్ 11 (డిప్యుటేషన్): ఫారిన్ సర్వీస్ లేదా వేరే చోట డిప్యుటేషన్ మీద వెళ్లినా కూడా ఈ రూల్స్ అన్నీ వర్తిస్తాయి.
రూల్ 12 (వసూలు): ప్రతి నెలా జీతం నుంచే నేరుగా చందా డబ్బులు కట్ అవుతాయి.
వడ్డీ & అడ్వాన్సులు
రూల్ 13 (వడ్డీ): ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం మన ఖాతాలోని డబ్బులకు ఏటా వడ్డీ ఆటోమెటిక్‌గా జమ అవుతుంది.
రూల్ 14 (తాత్కాలిక అడ్వాన్సులు): అనారోగ్యం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం లేదా న్యాయపరమైన కేసుల కోసం... 3 నెలల జీతం లేదా ఖాతాలో ఉన్న సగం డబ్బును (ఏది తక్కువైతే అది) అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు.
రూల్ 15 (అడ్వాన్స్ రికవరీ): అలా తీసుకున్న అడ్వాన్స్‌ను 12 నుంచి 24 వాయిదాల్లో తిరిగి జీతం నుంచి కట్ చేస్తారు.
పాక్షిక-తుది ఉపసంహరణలు (Part-Final Withdrawals) - తిరిగి చెల్లించనవసరం లేనివి
రూల్ 15-A: 15 లేదా 20 ఏళ్ల సర్వీస్ పూర్తయ్యాక, లేదా రిటైర్మెంట్‌కి పదేళ్లు ఉన్నప్పుడు చదువు, పెళ్లిళ్లు, అనారోగ్యం, ఇల్లు కోసం ఈ డబ్బు తీసుకోవచ్చు. దీన్ని తిరిగి కట్టాల్సిన పనిలేదు.
రూల్ 15-B: పిల్లల ఉన్నత చదువుల కోసం (విదేశీ విద్యతో సహా) తీసుకోవచ్చు.
రూల్ 15-C: అనారోగ్య ఖర్చుల కోసం తీసుకోవచ్చు.
రూల్ 15-D: పిల్లల లేదా కుటుంబంలోని ఆడపడుచుల పెళ్లిళ్లు, నిశ్చితార్థం కోసం వాడొచ్చు.
రూల్ 15-E: కొత్త ఇల్లు కొనుక్కోవడానికి లేదా కట్టుకోవడానికి వాడుకోవచ్చు.
రూల్ 15-F & 15-G: ఇంటి స్థలం కొనడానికి, ఆ స్థలంలో ఇల్లు కట్టడానికి ఈ రూల్స్ కింద డబ్బు ఇస్తారు.
రూల్ 15-H: రిటైర్మెంట్‌కి 6 నెలల ముందు.. వ్యవసాయ భూమి లేదా వ్యాపారం చేసుకోవడానికి స్థలం కొనుక్కోవడానికి డ్రా చేసుకోవచ్చు.
రూల్ 15-I: సర్వీస్ చివర్లో కారు కొనుక్కోవడానికి కూడా తీసుకోవచ్చు.
రూల్ 15-J (మార్పు): ఇదివరకే అడ్వాన్స్ తీసుకుని, దాన్ని కట్టలేని పరిస్థితుల్లో ఉంటే... ఆ అడ్వాన్స్‌ను "పాక్షిక ఉపసంహరణ"గా మార్చుకోవచ్చు.
జీవిత బీమా / LIC పాలసీలు
రూల్ 16 నుంచి 26-A వరకు: పీఎఫ్ ఖాతాలో కట్టాల్సిన చందాకి బదులుగా, నేరుగా ఆ డబ్బుతో ఎల్‌ఐసీ (LIC) లేదా ఇతర జీవిత బీమా పాలసీల ప్రీమియం కట్టుకునే వీలు ఈ రూల్స్ కల్పిస్తాయి. కానీ ఆ పాలసీ బాండ్లను ప్రభుత్వానికి (గవర్నర్‌కు) ష్యూరిటీగా అప్పగించాలి. రిటైర్ అయ్యాక వాటిని తిరిగి మనకే ఇచ్చేస్తారు. (అయితే 1979 తర్వాత తీసుకున్న కొత్త పాలసీలకు ఈ సదుపాయం ఆపేశారు).
తప్పుగా వాడితే రికవరీ
రూల్ 27 & 27-A: ఇల్లు కడతాను అని చెప్పి డబ్బులు డ్రా చేసి వేరే దానికి వాడితే (కారణం తప్పుగా చూపిస్తే), ఆ డబ్బు మొత్తాన్ని ఒకేసారి జీతం నుంచి రికవరీ చేస్తారు.
తుది చెల్లింపులు (Final Payments)
రూల్ 28 & 29: ఉద్యోగి రిటైర్ అయినప్పుడు, విరామం తీసుకున్నప్పుడు లేదా ఉద్యోగం మానేసినప్పుడు ఖాతాలో ఉన్న డబ్బునంతటినీ వడ్డీతో సహా ఇచ్చేస్తారు.
రూల్ 30 (మరణిస్తే): దురదృష్టవశాత్తూ ఉద్యోగి సర్వీసులో ఉండగా చనిపోతే, ఆ డబ్బును నామినీకి ఇస్తారు. నామినీ లేకపోతే కుటుంబ సభ్యులకు సమానంగా పంచుతారు.
రూల్ 30-A (బూస్టర్ స్కీమ్): 5 ఏళ్ళ సర్వీస్ పూర్తయి, ఖాతాలో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ సర్వీసులో చనిపోతే... ఖాతాలోని డబ్బుతో పాటు, అదనంగా రూ.20,000 వరకు కుటుంబానికి అదనపు సహాయంగా ఇస్తారు.
పరిష్కారం & బదిలీలు
రూల్ 31 (చెల్లింపు విధానం): రిటైర్ అయ్యే సంవత్సరానికి ముందే తుది చెల్లింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. మతిస్థిమితం లేని వారికి కోర్టు నియమించిన సంరక్షకుల ద్వారా డబ్బు ఇస్తారు.
రూల్ 32, 32-A, 32-B (బదిలీలు): మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి లేదా కార్పొరేట్ సంస్థలకు బదిలీ అయితే, మన ఖాతాలోని డబ్బు అక్కడి పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది.
అడ్మినిస్ట్రేషన్
రూల్ 33: ఈ డబ్బులన్నీ ప్రభుత్వ ఖాతాలలో "ది జనరల్ ప్రావిడెంట్ ఫండ్" కింద భద్రంగా ఉంటాయి.
రూల్ 34: ప్రతి చందాదారుడికి కచ్చితంగా ఒక అకౌంట్ నంబర్ ఉంటుంది.
రూల్ 35 (వార్షిక స్టేట్‌మెంట్): ప్రతి సంవత్సరం చివర్లో మీ ఖాతాలో ఎంత డబ్బు జమ అయ్యింది, ఎంత వడ్డీ వచ్చింది అని తెలిపే స్టేట్‌మెంట్‌ను మీకు పంపుతారు. అందులో తప్పులు ఉంటే 3 నెలల్లోపు కంప్లైంట్ చేయొచ్చు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి