గైర్హాజరు (FR-18)
ప్రభుత్వం ప్రత్యెక పరిస్తితులుగా పరిగణిస్తే తప్ప ఏ ప్రభుత్వ ఉద్యోగికి వరుసగా ఐదేళ్లకు మించి సెలవు మంజూరు చేయకూడదు. కేవలం అనారోగ్య కారణాల వల్ల ఆ ఉద్యోగి గైర్హాజరు అయిన సందర్భం లో, ఆ ఉద్యోగి తిరిగి విధుల్లో చేరగలడని వైద్యుల సలహా మేరకు మాత్రమే వెసులు బాటు ఇవ్వవచ్చు. మానసిక, శారీరక అనారోగ్య సమస్యల కారణంగా గైర్హాజరు అయితే ఉద్దేశ్య పూర్వక గైర్హాజరు గా పరిగణించాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భంలో ఐదేళ్లకు మించిన సెలవును అసాధారణ సెలవు (EOL) పరిగణించ వచ్చు. ఉద్దేశ్య పూర్వకమైన గైర్హాజరు ని డైస్ నాన్ గా పరిగణించాలి. ఈ కాలాన్ని ఇంక్రిమెంట్ కి, లీవ్ కి, పెన్షన్ కి పరిగణన లోకి తీసుకోకూడదు. వైద్య కారణాల పై తీసుకునే అసాధారణ సెలవు (EOL) ని 36 నెలల వరకు అర్హత గల సర్వీస్ గా పరిగణన లోకి తీసుకోవచ్చు. సాంకేతిక విద్య కొరకు అసాధారణ సెలవు పొందితే 36 నెలల వరకు అర్హత గల సర్వీస్ గా పరిగణన లోకి తీసుకోన వచ్చును. కాకపోతె కోర్సు పూర్తీ అయిన తరువాత 36 నెలల పాటు ప్రభుత్వ సర్వీస్ లో ఉండాలి. ఎవరినా ఉద్యోగి ఏడాది కన్నా ఎక్కువ కాలం గైర్హాజరు అయితే, ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీస్ (CCA...