గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GIS)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొరకు 01.11.1984 నుండి గ్రూప్ ఇన్సూరెన్స్ పధకాన్ని ప్రారంభించింది. APSEGIS గా పిలువబడే ఈ పధకాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 29౩ (ఆర్ధిక శాఖ), తేదీ 08.10.1984 ద్వారా అమలు లోకి తీసుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం లోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ మరియు నాల్గవ తరగతి ఉద్యోగులు అందరూ దీనికి అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క టైం స్కేల్ ఆధారంగా దిగువ పేర్కొన్న విధంగా చందాను జమ చేయాలి. ఆంధ్ర ప్రదేశ్ పే స్కేల్ గ్రూప్ చందా 01.11.1994 ఇన్సూరెన్స్ మొత్తం 54060 - 140540 అంతకన్నా పై స్కేల్ వారికి A 120 (8 యూనిట్లు) 120000 35570 - 109910 నుండి 48440 - 137220 వరకు B 60 (4 యూనిట్లు) 60000 25220 - 80910 నుండి 34580 - 107210 వరకు C 30 (2 యూనిట్లు) 30000 20000 - 61960 నుండి 23780 - 76730...